కలం, వెబ్ డెస్క్ : మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్‌లో జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమచార సేకరణ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విపక్ష వైసీపీపై ఫైర్ అయ్యారు. అధికారం పోయినా, 11 సీట్లకు పరిమితం అయినా వారిలో మార్పు రాలేదని మండిపడ్డారు. ఇప్పటికి కూడా నోటికొచ్చినట్లు ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. బూతులు తిట్టే 150 నుంచి 11 కి వచ్చారు.. ఇప్పుడు 1 సీటు వచ్చే వరకు మీరు అస్సలు తగ్గకండి అంటూ వైసీపీ నేతలకు చురకలు అంటించారు.
‘నన్ను తిట్టేవాళ్లంతా కాపులే’
కాపులో ఐక్యత లేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కేవలం గొడవల సమయంలోనే ఏకం అవుతారని ఎద్దేవా చేశారు. లింగమనేని రమేష్ కి రాజ్యసభ ఇస్తే తిడతారని , అలాగే వైసీపీలో తనను తట్టేవాళ్లంతా కాపులేనని వ్యాఖ్యానించారు.ఈ క్రమంలోనే గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసు పై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. నేరానికి కులం ఉండదని స్పష్టం చేశారు. అయితే 14 ఏళ్ల బాలికను హింసించిన నేరస్తుడిగా వత్తాసుగా వైసీపీ నేతల వెళ్తారా? అని ప్రశ్నించారు. ఆ తల్లి పడే బాధ తనకు తెలుసునని.. అయితే కేవలం మీ కులమైతే ఓ క్రిమినల్‌ను ఎలా వెనకేసుకొస్తారు? అని వైసీపీ కాపు రాజకీయ నేతల్ని ప్రశ్నించారు. వైసీపీ కులాన్ని రాజకీయం కోసం వాడుకుంటోందని విమర్శలు గుప్పించారు.

