ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : అమావాస్య సందర్భంగా బుధవారం రోజు మహబూబ్​ నగర్​ (Mahabubnagar) పట్టణంలోని శ్రీ రాఘవేంద్ర‌నగర్ (ఎస్ఆర్) కాలనీ అభయాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న వినాయక విగ్రహాని కి ఆలయ పూజరులు పూజలు చేశారు. అనంతరం ఆంజనేయ స్వామికి అభిషేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా కాలనీ వాసులు స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రావణ మాసం మొదలు కావడంతో ఈ ఆలయంలో ప్రతివారం ప్రత్యేక పూజలు చేస్తామని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజా కార్యక్రమం లో కాలనీకి చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>