కరీంనగర్‌లో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ

కలం, కరీంనగర్ బ్యూరో : దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ‘హర్ ఘర్ తిరంగా’ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, కరీంనగర్ (Karimnagar) బిజెపి వెస్ట్ జోన్ అధ్యక్షుడుజాడి బాల్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రోజున ఢిల్లీ డిఫెన్స్ విద్యార్థులతో కలిసి తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం ఈ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు.

దేశవ్యాప్తంగా 2022 సంవత్సరం నుండి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ప్రజలందరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసి, దేశంపై తమకున్న దేశభక్తి భావాన్ని చాటిచెబుతున్నారు. తిరంగా కార్యక్రమాలు దేశ ఐక్యతను మరింత పటిష్టం చేయడానికి, నేటి యువతలో దేశభక్తి భావాలను పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమల ఆంజనేయులు, పార్లమెంటు కన్వీనర్, కార్పొరేటర్ ప్రవీణ్ రావు, సీనియర్ నాయకులుగుజ్జ శ్రీనివాస రావు , కార్పొరేటర్లు బండ రమణారెడ్డి కర్రె పద్మ అనీల్, జోన్ అధ్యక్షులు జాడి బాల్ రెడ్డి, బూత్ ప్రెసిడెంట్ పరశురాములు, బి ఎల్ ఎ 2లు కాసం సంతోష్, గాడుగోని రమేష్, మల్లారెడ్డి, చందర్, తిరుమలరెడ్డి, ఉదయ్, నరేష్, బండ రాకేష్, విద్యాసాగర్ ల తో పాటు ఢిల్లీ డిఫెన్స్ స్కూల్ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>