జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ కార్యవర్గం ఎన్నిక

కలం, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ (Nagarkurnool) వర్కింగ్ జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం సొసైటీ ఎన్నికల అధికారి సి.నారాయణరెడ్డి, సందీప్ ల ఆధ్వర్యంలో సింగిల్ విండో సమావేశ భవనంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు.

11 మంది డైరెక్టర్లకు గాను ఒక్కొ నామినేషన్ మాత్రమే దాఖలు కాగా అధ్యక్షుడిగా పుట్టపాగ వెంకటస్వామి, ఉపాధ్యక్షుడిగా మునగాల చంద్రశేఖర రావు, ప్రధాన కార్యదర్శిగా కందికొండ మోహన్, కోశాధికారిగా సురేష్ రావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యులుగా కేఎస్ సురేష్, తిప్పర్తి విజయ్, ఖానాపురం ప్రదీప్, రాజేష్ కుమార్ గౌడ్, గబ్బి సత్యనారాయణ, మహమ్మద్ దర్వేష్, కొండకింది మాధవరెడ్డిలను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొత్తం 25 మంది సొసైటీ సభ్యులకు గాను 20 మంది ఈ ఎన్నికలలో హాజరయ్యారు.

జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం : పుట్టపాగ వెంకటస్వామి

జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా అందరితో కలిసి ముందుకు వెళ్తానని నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పుట్టపాగ వెంకటస్వామి తెలిపారు. జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఆయన మాట్లాడుతూ, కొత్తగా ఏర్పడ్డ కమిటీ అందరి సహకారంతో ముందుకు వెళ్లి జర్నలిస్టుల ఇళ్లస్థలాల సమస్యను పరిష్కరించే దిశగా పని చేస్తామన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>