కాంగ్రెస్‌లో చేరిన జనసేన నాయకులు

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డిలో జనసేన పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కామారెడ్డి (Kamareddy) పట్టణ కేంద్రంలో టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన జిల్లా నాయకులు, కామారెడ్డి క్రెడా సంఘం అధ్యక్షులు గణగోన లక్ష్మీ నర్సాగౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు క్రెడా ప్రధాన కార్యదర్శి రాంచందర్ నాయక్, కోశాధికారి మాదాస్ రాజలింగంలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందని, అది చూసి తాము కాంగ్రెస్‌లో చేరామని తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై పార్టీలోకి రావడం పట్ల గడ్డం చంద్రశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జనసేన జిల్లా నాయకులు గణగోన లక్ష్మీ నర్సాగౌడ్, కోశాధికారి మాదాస్ రాజలింగం, సెక్రటరీలు పార్టీలోకి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేలా కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి (Kamareddy) జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, కామారెడ్డి మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, జమిల్, కాంగ్రెస్ నాయకులు రంగ రమేష్ గౌడ్, బల్ల శ్రీనివాస్, అరుణ్, మెహర్ బాబా గౌడ్, శ్రీకాంత్ ఉన్నారు.

Read Also: బెంగాల్ ఎన్నికల్లో ‘లక్ష్మణరేఖ’.. 100 మీటర్ల దూరంలోనే…

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>