కలం డెస్క్ : తెలంగాణను అవమానించే తీరులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పవన్ కల్యాణ్‌పై ఘాటుగానే విరుచుకుపడ్డారు. కానీ బీజేపీ మాత్రం పవన్ కామెంట్స్ తో కక్కలేని మింగలేని స్థితిలో పడింది. ఆయన కామెంట్లను సమర్ధిస్తే తెలంగాణ ప్రజల నుంచి సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యతిరేకిస్తే ఏపీలో పొత్తు ధర్మం విషయంలో పవన్‌కు ఆగ్రహం కలుగుతుందనే అనుమానం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) మినహా రాష్ట్ర బీజేపీ నాయకులు పవన్ కల్యాణ్ కామెంట్లపై మౌనం పాటిస్తున్నారు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనుండడం కూడా ఒక కారణం.
ప్రజల వ్యక్తిగత దైవారాధనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్లను సీరియస్‌గా తీసుకున్న బీజేపీ… హిందు దేవుళ్ళను అవమానిస్తారా అంటూ విమర్శించింది. ఢిల్లీ స్థాయిలోనూ కేంద్ర మంత్రులు, ఎంపీలు సీఎం రేవంత్‌ను విమర్శిస్తున్నారు. కానీ పవన్ విషయంలో మాత్రం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాపాడే ఎత్తుగడను అవలంబిస్తున్నారు. పవన్(Pawan Kalyan) కామెంట్లు యావత్తు తెలంగాణ ప్రజలపై చేసినవేనని, ఏ మాత్రం ఉపేక్షేంచేవి కావని తెలంగాణ సమాజం ఆగ్రహంతో ఉన్నది. ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్‌ను రక్షించుకునేందుకు, ఆయన చేసిన కామెంట్లను డైవర్ట్ చేయడానికి బీజేపీ ఒక పథకం ప్రకారమే సీఎం రేవంత్ వ్యాఖ్యలను హైలైట్ చేసి రాజకీయం చేస్తున్నది. తెలంగాణ ప్రజలను పవన్ అవమానించినా తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం సైలెంట్‌గా ఉండిపోయారు.
సీఎం రేవంత్‌తో బీజేపీకి భయం :
బీజేపీని ప్రతీ అంశంలో నిలదీయడమే కాక ఆ పార్టీ మతతత్వ రాజకీయాలను తెలంగాణలో సాగనివ్వబోమంటూ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అడ్డుకుంటున్నారు. బీజేపీకి ఆ భయం పట్టుకుందని, అందుకే పనిగట్టుకుని రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తున్నదనే మాటలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి బీజేపీ ఎంత ప్రయత్నించినా ఓటర్లు కాంగ్రెస్‌కే జైకొట్టారు. అది బీజేపీకి మింగుడు పడలేదు. అందుకే బీజేపీకి రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా మారారని కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే కామెంట్ చేశారు.
Read Also: పవన్ విద్వేషాలను రెచ్చగొట్టొద్దు.. షర్మిల ఫైర్
Follow Us On: Whatsapp


