ఐబొమ్మ రవి (Ibomma Ravi)కి పోలీసులు బంపర్ ఆఫర్ చేశారా.. రవి దానికి ఒప్పుకోలేదా.. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ప్రచారం జరుగుతోంది. ఇది నిజమో కాదో తెలియదు గానీ.. సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఊగిపోతోంది. రవి ట్యాలెంట్ ను ఉపయోగించుకునేందుకు పోలీసు డిపార్టుమెంట్ లో ఉద్యోగం ఇస్తామన్నారని.. రవి దానికి ఒప్పుకోలేదని అంటున్నారు. తనకు జాబ్ ఏమీ వద్దని.. కరేబియన్ దీవుల్లో రెస్టారెంట్ పెట్టి అలా వచ్చిన డబ్బుతో లైఫ్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపాడంట. వాస్తవానికి కస్టడీలో ఏం అడిగారు, ఏం సమాధానం ఇచ్చాడు అనేది బయటకు తెలియదు.
కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ ప్రచారం స్టార్ట్ అయింది. పోలీసులే ఐబొమ్మ రవి (Ibomma Ravi)ని చీటర్, హ్యాకర్, కుట్రపూరితంగానే కరేబియన్ సిటిజన్ షిప్ తీసుకున్నాడని అంటున్నారు. అలాంటప్పుడు పోలీసులు ఉద్యోగం ఎలా ఇస్తారు. పైగా కోర్టులో నిందితుడిగా రవిని నిలబెట్టిందే పోలీసులు కదా. దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులకే సవాల్ విసిరిన చరిత్ర రవిది. రవి మీద పోలీసులు ఫుల్ సీరియస్ గానే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఫేక్ న్యూస్ అని తేలిపోతోంది. రవికి వస్తున్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని రీచ్ కోసం, వ్యూస్ కోసం ఇలాంటివి క్రియేట్ చేస్తున్నట్టు తేలిపోతోంది.
Read Also: సంచలన కేసులో టాలీవుడ్ సినీ పెద్దలు!!
Follow Us On: X(Twitter)


