డిప్యూటీ సీఎం ఈజ్ బ్యాక్.. నేడు విజయవాడకు పవన్ కళ్యాణ్​

కలం, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్​ (Pawan Kalyan) మూడు వారాల విరామం తరువాత విజయవాడ రాబోతున్నారు. ఉదయం 11.30కు మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకుని.. శాఖాపరమైన అంశాలపై అధికారులతో సమీక్షించనున్నారు. అలాగే, సాయంత్రం పార్టీ నేతలతో కూడా సమావేశమై.. తాజా పరిణామాలపై చర్చించబోతున్నారు. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో కూడా పాల్గొనబోతున్నారు.

కంటికి శస్త్ర చికిత్స కారణంగా..

పవన్ కళ్యాణ్​ అధికారిక విధుల్లో ఉండగా..  కంటి సమస్య తలెత్తింది. దీంతో వెంటనే హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరగా.. పరీక్షలు చేసిన వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పారు. విజయవంతంగా పూర్తయిన తరువాత, వారం పది రోజులు విశ్రాంతి తీసుకోవాలని.. ఆ తరువాతనే విధుల్లోకి వెళ్లాలని సూచించారు. దీంతో, మాదాపూర్‌లోని ఇంటికే పరిమితం అయ్యారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా స్వయంగా పవన్ కళ్యాణ్​ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో తిరిగి సచివాలయంలోకి అడుగు పెట్టబోతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>