Mobile Popup Ad
Mobile Popup Ad

భద్రాద్రి జిల్లాలో ఘోరం.. పసికందు తలను పీక్కుతిన్న కుక్కలు!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పాల్వంచ సమీపంలోని బొల్లూరిగూడెం ప్రాంతంలో బుధవారం ఉదయం ఒక పసికందు తెగిపడిన తల భాగాన్ని వీధి కుక్కలు పీక్కు తింటుండటాన్ని గమనించిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముందు కుక్కలు ఏదో మాంసం ముద్దను లాగుతున్నాయని గమనించిన స్థానికులు, దగ్గరకు వెళ్లి చూడగా అది పసికందు తల అని తెలిసి నిర్ఘాంతపోయారు. పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఎవరీ పసికందు.. ఎన్నెన్నో ప్రశ్నలు..

పసికందు తలను కుక్కలు పీక్కు తినడం స్థానికంగా కలకలం రేపింది. ఎవరీ పసికందు.. ఇంట్లో ఉండగా కుక్కలు ఎత్తుకొని ఇక్కడికి తీసుకొచ్చాయా.. లేదా అవాంఛిత గర్భం అని ఎవరైనా పసికందును పడేశారా.. అని ఎన్నెన్నో ప్రశ్నలు వస్తున్నాయి. తల భాగం ఇక్కడ ఉండే.. మిగతా శరీరం ఎక్కడుందని చుట్టుపక్కల వెతుకుతున్నారు. పోలీసులు ఆ తల భాగాన్ని స్వాధీనం చేసుకుని, అది ఎన్ని రోజుల శిశువు? ఆడ శిశువా లేక మగ శిశువా? అనే వివరాలను సేకరిస్తున్నారు. సమీపంలోని ఆసుపత్రులలో ఇటీవల జరిగిన ప్రసవాల వివరాలను, గర్భిణుల రికార్డులపై ఆరా తీస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>