Mobile Popup Ad
Mobile Popup Ad

ఏసీబీ వలలో హెడ్ మాస్టర్!

కలం, వరంగల్ బ్యూరో: తెలంగాణ ఏసీబీ (ACB) అధికారుల‌కు ఓ అవినీతి హెడ్ మాస్ట‌ర్‌ ప‌ట్టుబ‌డ్డాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంత‌కం కోసం త్వ‌ర‌లో రిటైర్ కానున్న‌ ఉపాధ్యాయుడి నుంచి రూ.15 వేలు డిమాండ్ చేసిన హెడ్ మాస్ట‌ర్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. జింజిరాల రవికుమార్ మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా గూడూరు మండలంలో ఇంచార్జ్ ఎంఈఓగా, అయోధ్యపురం పాఠ‌శాల‌లో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వ‌హిస్తున్నారు. ఉపాధ్యాయుడు దయ్యాల రవీందర్ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రవి కుమార్ అతని నుంచి రూ.15 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్ర‌యించాడు.

ఏసీబీ అధికారులు ప్లాన్ ప్ర‌కారం రవికుమార్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ర‌వికుమార్‌తో పాటు అత‌డికి అసిస్టెంట్‌గా ప‌ని చేస్తున్న అయోధ్య‌పురం పాఠ‌శాల స్కూల్ అసిస్టెంట్ చంద్ర‌మౌళిని అరెస్ట్ చేశారు. వీరిద్ద‌రిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు. ఎవ‌రైనా ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో లంచాలు డిమాండ్ చేస్తే త‌మ దృష్టికి తీసుకురావాల‌ని అధికారులు సూచించారు. విద్యా శాఖ‌లో సైతం అధికారులు లంచాలు తీసుకుంటుండం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Read Also: తమ్మడపల్లి జంట హత్యల మిస్టరీ.. ఏడాది కావస్తున్నా పురోగతి ఏది ?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>