తమ్మడపల్లి జంట హత్యల మిస్టరీ.. ఏడాది కావస్తున్నా పురోగతి ఏది ?

కలం, వరంగల్ బ్యూరో : జనగామ (Jangaon) జిల్లా జఫర్ గడ్ మండలం తమ్మడపల్లి (ఐ) గ్రామంలో గత సంవత్సరం ఆగస్టులో అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తల్లీ కూతురు తుమ్మ అన్నమ్మ (80), గాలి రాణమ్మ (60) దారుణ హత్యకు గురయ్యారు. మరుసటి రోజు సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బంగారం కోసమా లేదా పాత కక్షల నేపథ్యంలో తల్లీ కూతురు హత్య జరిగి ఉంటుందా అని అనుమానించిన పోలీసులు ఇప్పటికీ కేసును చేదించలేకపోయారు. కనీసం ఆ జంట హత్యలకు గల సరైన కారణాలను కూడా గుర్తించలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. హతుల సంబంధీకులు మాత్రం ఎనిమిది నెలలుగా కేసు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు.

వరంగల్ పోలీస్ కు మచ్చ!

వరంగల్ (Warangal) పోలీసులకు ఎవర్​ విక్టోరియస్ అనే పేరుంది. కానీ కొంతమంది అవినీతి పోలీసుల కారణంగా ఆ పేరుకున్న పాపులారిటీ క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. దీనికి తోడు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న పలువురు అధికారుల వల్ల కొన్ని కేసులు పరిష్కారం కాక మూలన పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పోలీస్ అధికారుల పనితీరును బట్టి వారికి ఆయా పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్ లు ఇచ్చేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పోలీస్ వ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ఎస్ఐ, సీఐ స్థాయి అధికారులకు ఎస్పీ, డీఐజీ, ఐజీ లు పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి పోయి ఎమ్మెల్యేలు, మంత్రులు డిసైడ్ చేస్తున్నారు. నేతలు ఇచ్చే సిఫార్స్ లేఖల ఆధారంగా పోస్టింగ్ లు కేటాయిస్తున్నారు. దీంతో కొందరు పోలీసులు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఊడిగం చేయడంతోనే టైమ్ సరిపోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా కొన్ని కేసుల్లో రాజకీయ జోక్యం ఎక్కువై నీరుగారిపోతున్నాయానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read Also: ఎన్నాళ్లీ ‘డోలీ’ మోతలు.. ఏపీలో మారని గిరిజన బతుకులు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>