కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని కామినేని హాస్పిటల్ (Kamineni Hospital)లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌కు చెందిన లెక్చరర్ నరేష్ గుండెలో చిన్న నొప్పి రావడంతో కామినేని హాస్పిటల్‌కు వెళ్లారు. నరేష్‌ను చెక్ చేసిన డాక్టర్లు అతడికి కొన్ని టెస్టులు రాయగా.. అతడు టెస్టులు చేయించుకున్నాడు. టెస్టుల అనంతరం ఆపరేషన్ చేయాలని.. ఆపరేషన్‌కు రూ.8 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు వెల్లడించారు. దీంతో నరేష్ రూ.5 లక్షలు ఇన్సూరెన్స్ తీసుకుని ఆపరేషన్ చేయించుకున్నారు. అయితే ఆపరేషన్ చేసిన తర్వాత నరేశ్ మృతిచెందాడు. జూనియర్ డాక్టర్లతో ఆపరేషన్ చేయించారని, అందుకే నరేష్ మృతిచెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
Read Also: మహిళా బిల్లును వ్యతిరేకిస్తే పుట్టగతులు ఉండవు: మోదీ
Follow Us On : WhatsApp

