కలం, వెబ్ డెస్క్ : పటాన్‌చెరు (Patancheru) పట్టణంలోని ఒక ఖానావళి హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి హోటల్ ప్రాంగణాన్ని చుట్టేయడంతో ఆ ప్రాంతమంతా పోగలు వ్యాపించాయి. పేలుడు తీవ్రతకు హోటల్‌లోని సామాగ్రి పూర్తిగా ధ్వంసమై చెల్లాచెదురుగా పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్‌తో అక్కడికి చేరుకున్నారు. వారు శ్రమించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.

