బండి సంజయ్ రాజీనామాకు పట్టు.. బీఆర్ఎస్వీ ఆందోళన

కలం, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని.. లేకపోతే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ (BRSV) నేతలు డీజీపీ ఆఫీస్ దగ్గర ఆందోళనకు దిగారు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మైనర్ బాలికకు అన్యాయం జరుగుతున్నా, ఇంతవరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సామాన్యులకు ఒక న్యాయం.. సంపన్నులకు ఒక న్యాయమా.. అని ప్రశ్నించారు. అధికార దుర్వినియోగం చేస్తూ.. కుమారుడిని కేసులో నుంచి తప్పించేలా బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>