శంషాబాద్ విమానాశ్రయం(Shamshabad Airport)లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వియత్నాం ఎయిర్‌లైన్స్‌కు చెందిన వీఎన్–984 విమానం సాంకేతిక లోపంతో రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో సుమారు 200 మంది ప్రయాణికులు రాత్రంతా విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. ఈ సందర్భంగా ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, సరైన సమాచారం ఇవ్వడంలేదని ఆరోపిస్తూ ప్రయాణికులు ఆందోళనకు దిగారు.
అనేక సర్వీసులు ఆలస్యం
ఇక కౌలాలంపూర్ వెళ్లాల్సిన మరో విమానంలోనూ సాంకేతిక సమస్య తలెత్తడంతో అది నిర్దేశిత సమయానికి 6 గంటల ఆలస్యంగా బయలుదేరింది. దిల్లీలో ఏర్పడిన ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) సమస్య కారణంగా ఢిల్లీ, ముంబయి, శివమొగ్గలకు వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. గోవా వెళ్లాల్సిన సర్వీసు కూడా ఆలస్యంగా నడిచింది. ఈ పరిణామాలతో శంషాబాద్ విమానాశ్రయం(Shamshabad Airport)లో రాత్రంతా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Read Also: టార్గెట్ హిడ్మా.. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కోసం ముమ్మర గాలింపు
Follow Us on: Youtube

