కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ (Parliament) ఉభయసభల సమావేశాలు మరోసారి వాయిదా పడ్డాయి. ఉభయ సభలు ప్రారంభమైనప్పటి నుండి విపక్ష సభ్యులు నినాదాలతో సభను స్తంభింపజేశారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్షా పత్రాల లీకేజీ అంశం, అలాగే అయోధ్యలో జరిగిన పరిణామాలపై తక్షణమే చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి.
సభ సజావుగా సాగేందుకు స్పీకర్, చైర్మన్ ప్రయత్నించినప్పటికీ విపక్షాల ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లిన సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సభలో నెలకొన్న ఈ తీవ్ర గందరగోళం, సభ్యుల నిరంతర ఆందోళనల కారణంగా లోక్‌సభ, రాజ్యసభలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వాయిదా పడుతూ వచ్చాయి. చివరకు ఉభయ సభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

