డీఎంకేలో చేరిన ప‌న్నీర్ సెల్వం

క‌లం, వెబ్ డెస్క్‌: త‌మిళ‌నాడు ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌గా ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్నాడీఎంకే ముఖ్యనేత, మాజీ సీఎం పన్నీర్ సెల్వం (Panneerselvam) నేడు డీఎంకే పార్టీలో చేరారు. పార్టీ అధ్య‌క్షుడు, సీఎం స్టాలిన్ (Stalin) ఆయ‌న‌కు కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అన్నాడీఎంకేలో (DMK) కీల‌క నేత‌గా ఉన్న‌ పన్నీర్ సెల్వం పార్టీ మార‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప‌న్నీర్ వారం రోజుల క్రితం స్టాలిన్‌తో భేటీ అయ్యారు.

ఈ స‌మావేశంలో వీరితో పాటు వీరి కుమారులు కూడా పాల్గొన్నారు. అప్పుడే ప‌న్నీర్ (Panneerselvam) పార్టీ మార‌బోతున్నార‌ని స్ప‌ష్ట‌మైంది. త‌మిళ న‌టుడు విజ‌య్ రాజ‌కీయాల్లోకి రావ‌డం, శ‌శిక‌ళ కొత్త‌ పార్టీ ప్ర‌క‌టించ‌డంతో స్టాలిన్‌కు రాజ‌కీయాంగా క‌ష్టాలు ఎదుర‌వ‌నున్నాయ‌ని అంతా భావిస్తున్న త‌రుణంలో ప్ర‌త్య‌ర్థి పార్టీ నుంచి కీల‌క నేత‌లు డీఎంకేలో చేర‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Read Also: టార్గెట్ హ‌రీశ్ రావు.. సిద్దిపేట‌లో క‌విత మ‌రో కీల‌క అడుగు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>