Mobile Popup Ad
Mobile Popup Ad

పంచాయతీ కార్మికురాలిపై వీధి కుక్క దాడి

కలం, వలిగొండ: యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో వీధి కుక్కలు హల్‌చల్ చేస్తున్నాయి. పట్టపగలే నడి వీధుల్లో తిరుగుతూ స్వైర విహారం చేస్తున్నాయి. వలిగొండ (Valigonda) పట్టణ కేంద్రంలో విధి నిర్వహణలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికురాలు భారతమ్మ పై వీధి కుక్క అకస్మాత్తుగా దాడి చేసి ఆమె చేతిని గాయపరిచింది. దీంతో ఆమె చేతికి తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే గమనించిన తోటి గ్రామ పంచాయతీ సిబ్బంది ఆమె చేతిని సబ్బు నీటితో శుభ్రం చేశారు. అనంతరం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే గతంలో కూడా వీధి కుక్కలు ఇద్దరు గ్రామ పంచాయతీ సిబ్బందిపై దాడి చేసినట్లు వారు తెలిపారు. అంతే కాకుండా దాదాపు పది మందికి పైగా ప్రజలను కూడా వీధి కుక్కలు కరిచిన సంఘటనలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ పాలకవర్గం స్పందించి వీధి కుక్కలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>