ఈ-శ్రమ్ పోర్టల్ అద్భుత ఫలితాలను ఇస్తోంది: కిషన్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: దేశంలోని అసంఘటిత రంగాల్లోని కార్మికులకు సామాజిక భద్రత కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ-శ్రమ్ (e-Shram) పోర్టల్ అద్భుత ఫలితాలను ఇస్తోందని బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. ఈ-శ్రామ్ కార్డుల ద్వారా కార్మికులు ఎవరిపై ఆధారపడకుండా ధీమాగా, ఆత్మగౌరవంతో జీవించేలా భరోసా లభిస్తోందని పేర్కొన్నారు. మార్చి 23, 2026 నాటికి తెలంగాణలో ఈ పోర్టల్ కి విశేష స్పందన లభించిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,60,000 కంటే ఎక్కువ మంది కార్మికుల నమోదు చేసుకున్నట్లు వివరించారు. హైదరాబాద్ & సికింద్రాబాద్ జంట నగరాల్లో 3,76,000కు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని తెలిపారు.కేంద్రం ప్రకటించిన ఈ పథకం ప్రయోజనాలను అయన వివరించారు. ఈ స్కీం ప్రకారం ప్రమాదవశాత్తు మరణిస్తే పీఎంఎస్బీవై (PMSBY) కింద రూ.2 లక్షలు, శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందనుంది. దేశవ్యాప్తంగా చెల్లుబాటు అయ్యే 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య కలిగిన ఈ-శ్రమ్ కార్డును కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో నేరుగా అనుసంధానం చేసుకోవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>