కలం, వెబ్ డెస్క్ : బీజేపీ (BJP) అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలోనే పరిస్థితులు అదుపులోకి తీసుకురావడం కోసం టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావును (Ramchander Rao) అరెస్ట్ చేశారు. అలాగే పెద్ద ఎత్తున కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది బీజేపీ. హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం మోసం చేస్తోందని రాంచందర్ రావు విమర్శించారు. పేదల భూములు కూల్చడంపై ఉన్న శ్రద్ధ.. అభివృద్ధిపై లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: రేవంత్ రెడ్డిని సీఎం చేసింది నేనే: మల్లారెడ్డి
Follow Us On: Youtube

