కలం వెబ్ డెస్క్ : జమ్మూ కశ్మీర్(Jammu Kashmir)లో పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్(Pakistan Drone) చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. శనివారం తెల్లవారుజామున సాంబా సెక్టార్(Samba sector)లో బీఎస్ఎఫ్(BSF) బలగాలు ఈ డ్రోన్‌ను గుర్తించాయి. ఈ డ్రోన్ ద్వారా పాక్ కొన్ని ఆయుధాలను సాంబా సెక్టార్‌లో వదిలింది. ఫ్లోరా గ్రామం దగ్గర అధికారులు ఆయుధాలను గుర్తించారు. 2 పిస్టల్స్, ఒక గ్రెనేడ్, 16 రౌండ్ల బుల్లెట్లు, 3 పిస్టల్ మ్యాగజైన్లు వీటిలో ఉన్నాయి. అధికారులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాలు ఎవరి కోసం వచ్చాయన్నది అనుమానాస్పదంగా మారింది.
బీఎస్ఎఫ్ అధికారులు డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ డ్రోన్ డీజేఐ నియో2 మోడల్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇది సాధారణంగా గూఢచర్యానికి ఉపయోగించే డ్రోన్ అని పేర్కొన్నారు. డ్రోన్‌ను సాంకేతిక విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. దాని మూలం, ప్రయోజనం ఏమిటన్న దానిపై విచారణ కొనసాగుతోంది. రిపబ్లిక్ డే సమీపిస్తున్న నేపథ్యంలో సాంబా, కతువా జిల్లాలు, రాజౌరి, పూన్చ్ సరిహద్దు ప్రాంతాలు, అలాగే కిష్త్వార్, డోడా, ఉధంపూర్ బెల్ట్‌లలో భద్రతా బలగాలు హై అలర్ట్‌లో ఉండి, సరిహద్దుల వెంట గస్తీని మరింత పెంచాయి.


