బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్(Salman Khan)ను పాకిస్థాన్ ఉగ్రవాదిగా ప్రకటించింది. పాకిస్థాన్ ఉగ్రవాద నిరోధక చట్టం(1997)లోని నాల్గవ షెడ్యూల్‌లో సల్మాన్ పేరును చేర్చినట్లు వెల్లడించింది. తాజాగా రియాద్‌లో జరిగిన జాయ్ ఫోరం 2025లో సల్మాన్ పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో సల్మాన్ మాట్లాడుతూ. పాక్‌లో భాగం అయిన బలూచిస్థాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రస్తావించాడు. అతడు చేసిన ఈ వ్యాఖ్యలకు పాక్‌స్థాన్(Pakistan) తీవ్రంగా పరిగణించింది. అందుకు ప్రతిస్పందగానే సల్మాన్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది.
‘‘ప్రస్తుతం ఒక హిందీ సినిమాను సౌదీలో విడుదల చేస్తే సూపర్ హిట్ అవుతుంది. అదే విధంగా తమిళ్, తెలుగు, మలయాళ సినిమాలు కూడా వందల కోట్ల వ్యాపారం చేస్తాయి. ఎందుకంటే అనేక దేశాలకు చెందిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. బలూచిస్థాన్, అఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ ప్రజలు అంతా ఇక్కడ ఉంటారు’’ అని సల్మాన్ చేసిన వ్యాఖ్యలు పాక్‌లో తీవ్ర కలకలం రేపాయి. బలూచిస్థాన్(Balochistan), పాకిస్థాన్‌ను వేరు చేసిన ప్రస్తావించడంతో సల్మాన్‌పై యాక్షన్ తీసుకోవడానికి పాక్ రెడీ అయింది. అందులో భాగంగానే సల్మాన్(Salman Khan)ను ఉగ్రవాదిగా ప్రకటించింది.
Read Also: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండ్‌పై వేటు

