Mobile Popup Ad
Mobile Popup Ad

పంట కొనుగోలు వేగంగా చేయాలి : పద్మా దేవేందర్ రెడ్డి

కలం, మెదక్ బ్యూరో : ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇప్పటికి 50% ధాన్యం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నదని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి (Padma Devender Reddy ) ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం శేరిపల్లి ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించి, రైతులతో మాట్లాడారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప ధాన్యం కొనుగోలు మాత్రం చేయడం లేదన్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, మూడు రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.

Read Also: అన్నీ ఒకే చోట.. ప్రతి పౌరుడికి ‘సమగ్ర సంక్షేమ కార్డు’ : సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>