కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లాలో వరి కొయ్యలు ఇద్దరు రైతులను బలి తీసుకున్నాయి. మిరుదొడ్డి మండలంలో మద్దెల మల్లయ్య అనే వ్యక్తి గురువారం నాఆడు వరి కొయ్యలు తగలబెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని మృతి చెందాడు . ఊపిరాడకపోవడంతో చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదే జిల్లాలో అయిదు రోజుల కిందట అక్బర్ పేట భూంపల్లి మండలం ఎనగుర్తిలో వరి కొయ్యలకు మంటలు పెడుతుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించి, ఎల్లయ్య(60) అనే రైతు అస్వస్థతతో చనిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో, వ్యవసాయాధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వరి కొయ్యలను తగలబెట్టొద్దని.. వాటి వలన భూసారం తగ్గిపోవడంతో పాటు ప్రాణాలకు ప్రమాదం అని సూచిస్తున్నారు.

