Mobile Popup Ad
Mobile Popup Ad

వేసవిలో చర్మ సౌందర్యం కోసం ఈ జ్యూస్ తాగండి

కలం, వెబ్ డెస్క్: మండే ఎండాకాలం వచ్చేసింది. మార్చి ఆరంభం నుంచే ఎండలు తీవ్రతరం అయ్యాయి. అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఈ మండే ఎండాకాలంలో చర్మాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు చెప్తున్నారు. ఎండ తాపం నుంచి శరీరాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు. మరి ఈ ఎండల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా కాపాడుకోవాలి? అన్న డౌట్ మీకూ ఉండా. అందుకు ఆరెంజ్ జ్యూస్ బెస్ట్ ఆప్షన్ అంటున్న నిపుణులు. మండే ఎండల వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురై, చర్మం తన సహజత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఆరెంజ్ జ్యూస్ ఒక అద్భుతమైన సహజ పరిష్కారంగా నిలుస్తోంది. తాజా నారింజ రసం (Orange Juice) తీసుకోవడం వల్ల చర్మం తాజాగా ఉండటమే కాకుండా, శరీరానికి అవసరమైన తక్షణ శక్తి లభిస్తుందని తాజా సమాచారం.

మెరిసే చర్మం కోసం కొల్లాజెన్:

ఆరెంజ్ జ్యూస్‌లో విటమిన్-సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో కొల్లాజెన్ అనే ప్రోటీన్ ఉత్పత్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రోటీన్ చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా ఉంచడమే కాకుండా, ముడతలు తగ్గించి సహజమైన మెరుపును అందిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

రోగనిరోధక శక్తి , కంటి ఆరోగ్యం:

ఇందులోని విటమిన్-సి ఇన్ఫెక్షన్లు, వైరస్‌లతో పోరాడేలా రోగనిరోధక శక్తిని పటిష్టం చేస్తుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. అటు విటమిన్-ఏ , యాంటీఆక్సిడెంట్లు కంటి అలసటను తగ్గించి, చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయని నివేదికలు చెబుతున్నాయి.

గుండె , జీర్ణక్రియ మెరుగుదల:

నారింజ రసం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడటం ద్వారా గుండె సంబంధిత సమస్యల ముప్పును తగ్గిస్తుంది. ఇందులోని ఫైబర్ , ఎంజైమ్‌లు జీర్ణక్రియను వేగవంతం చేసి, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

బరువు నియంత్రణ , కిడ్నీ సంరక్షణ:

తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మేలు చేస్తుంది. అలాగే ఇందులోని సిట్రేట్ మూత్రం pH స్థాయిని సమతుల్యం చేసి, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది.  అయితే, డయాబెటిస్ లేదా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడే వారు మాత్రం వైద్యుల సలహా మేరకు మాత్రమే ఆరెంజ్ జ్యూస్ (Orange Juice) తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.

Read Also: కేవలం జీతం కోసమే కాదు.. శాలరీ అకౌంట్‌తో ఇన్ని లాభాలా!

Follow Us On: Youtube

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>