వెండితెరపై ‘ఆపరేషన్ సిందూర్’.. దర్శకుడు ఎవరంటే?

కలం, వెబ్ డెస్క్ : దేశభక్తి, సైనిక పోరాటాల నేపథ్యంలో వచ్చే సినిమాలకు ప్రస్తుతం ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన  స్పై థ్రిల్లర్ ‘ధురందర్ 2’ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే  ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది వ్యాక్సిన్ వార్’ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి (Vivek Ranjan Agnihotri) సంచలన ప్రకటన చేశారు. భారత సైనిక పరాక్రమాన్ని, దౌత్య వ్యూహాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) అనే ప్రాజెక్ట్‌ను తీసుకురానున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ తో వివేక్ చేతులు కలిపారు.

ఈ ప్రాజెక్ట్ పై వివేక్ రంజన్ అగ్నిహోత్రి స్పందిస్తూ.. ”ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, ఒక నిజాన్ని వెలికితీయడం. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా, ఆధునిక యుద్ధ తంత్రంలో భారత్ ఎంతటి శక్తివంతమైనదో ఈ చిత్రం చూపిస్తుంది. భారత సాయుధ దళాలలోని వివిధ విభాగాల సహకారంతో లోతైన పరిశోధన చేసి ఈ కథను సిద్ధం చేశాం. వాస్తవాలను క్లారిటీతో ప్రపంచానికి చాటి చెప్పడమే మా లక్ష్యం” అని సోషల్ మీడియాలో వెల్లడించారు.

కాగా, ఈ చిత్రం రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ‘టైనీ’ ధిల్లాన్ రాసిన “Operation Sindoor: The Untold Story of India’s Deep Strikes Inside Pakistan” అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. 2025లో పహల్గామ్ వద్ద పర్యాటకులు, సామాన్య పౌరులపై జరిగిన ఘోర ఉగ్రదాడికి ప్రతికారంగా భారత ప్రభుత్వం చేపట్టిన అత్యంత రహస్యమైన, శక్తివంతమైన ఆపరేషన్ ఇది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ఎలా మట్టుబెట్టిందో ఈ సినిమాలో చూపించనున్నారు. త్వరలోనే ఈ చిత్రంలోని నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు. వాస్తవ ఘటనలను వెండితెరపై ఆవిష్కరించడంలో దిట్ట అయిన వివేక్ అగ్నిహోత్రి.. ‘ఆపరేషన్ సిందూర్’ ప్రాజెక్ట్ టేకాప్ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read Also: ఉదయం నిద్రలేవగానే తలనొప్పి వస్తుందా.. నిర్లక్ష్యం చేయొద్దు !

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>