ఇందూరు ఊర పండుగ తేదీ ఖరారు

కలం, నిజామాబాద్ బ్యూరో: ఏటా నిర్వహించనున్న ఇందూరు ఊర పండుగ (Oora Panduga) తేదీ ఖరారైంది. ఆగస్టు 2వ తేదీన ఊర పండగ నిర్వహిస్తున్నట్లు సర్వ సమాజ్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఆదివారం సిర్నాపల్లి గడిలో సర్వ సమాజ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఊర పండగలో భాగంగా జులై 30వ తేదీన పండుగకు అంకురార్పణ చేస్తూ ‘బండారు’ పోస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆలయ భూముల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసేందుకు కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పారు.

ముందుగా సర్వ సమాజ్ కమిటీ కన్వీనర్ రామర్తి గంగాధర్ మాట్లాడుతూ.. గత సంవత్సర ఊర పండగ (Oora Panduga) ఆదాయ ఖర్చు వివరాలను సభ్యులకు వివరించారు. ఈ సంవత్సరం కూడా నగరంలోని అన్ని కుల సంఘాలను కలుపుకొని ఊర పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. సంఘ సభ్యులు ఎక్కడా కూడా గొడవలు జరగకుండా సమన్వయంతో పండగ సజావుగా జరిగేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో సర్వ సమాజ్ కమిటీ కో కన్వీనర్ ఆదే ప్రవీణ్, అంతరెడ్డి సుదన్, బంటు బలరాం, భక్తవత్సలం, కౌడపు శరత్, సత్యపాల్, తదితరులు పాల్గొన్నారు.

Read  Also: నిర్మల్ జిల్లాలో ‘కారు’ స్టీరింగ్ పట్టేది ఎవరు?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>