Mobile Popup Ad
Mobile Popup Ad

ఆన్‌లైన్ గేమింగ్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

కలం, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్ గేమింగ్ (Online Gaming) వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా’ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అదనపు కార్యదర్శి అథారిటీ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా హోం, ఆర్థిక, సమాచార ప్రసార, యువజన, క్రీడా మంత్రిత్వ, న్యాయ శాఖల సంయుక్త కార్యదర్శులు ఉంటారని పేర్కొంది.

అథారిటీ ప్రధాన విధులు ఇవే..

దేశంలో ఆన్‌లైన్ గేమింగ్ (Online Gaming) కీలకమైన పరిశ్రమగా ఎదుగుతోంది. వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో గేమింగ్ రంగాన్ని పర్యవేక్షించడం, వినియోగదారుల గోప్యతను రక్షించడం, చట్టపరమైన నియమాలను అమలు చేసేందుకు ఈ అథారిటీని ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్స్ కు లైసెన్సులు ఇవ్వడంతో పాటు వినియోగదారుల డేటా భద్రతకు కాపలాదారుగా ఉండనుంది. అదే సమయంలో, 18 ఏళ్ల లోపు వారికి గేమింగ్‌ను నియంత్రించడంతో పాటు జూదం, బెట్టింగ్ వంటి అంశాలపై నిరంతర పర్యవేక్షణ చేయనుంది. దేశంలో ఇప్పటివరకు తమిళనాడు, తెలంగాణ మాత్రమే సొంతంగా ఆన్‌లైన్ గేమింగ్ చట్టాలు చేసి అమలు చేస్తున్నాయి.

Read Also: సీఎం లేఖ రాస్తే CBI దర్యాప్తుకి రెడీ : ఎంపీ రఘునందన్ రావు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>