అప్పుల ఊబిలో కూరుకుపోయి యువకుడి ఆత్మహత్య

కలం, భువనగిరి : క్షమించరాని ఆన్‌లైన్ బెట్టింగ్ (Online Betting) వ్యసనం మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. క్షణికావేశంలో వేసిన తప్పుడు అడుగులు, గెలుపుపై ఉన్న మోజులో చేసిన అప్పులు ఒక పచ్చని కుటుంబాన్ని రోడ్డున పడేసాయి. ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల మాయాజాలంలో చిక్కుకుని అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ యువకుడు కడతేరిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రాజాపేట మండలం రేణిగుంట గ్రామానికి చెందిన గంధమల్ల భరత్ (35) భువనగిరి పట్టణంలోని బంజారాహిల్స్ కాలనీలో ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు.

భరత్‌కు భార్య, ఒక కూతురు ఉన్నారు. కాలక్రమంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు అలవాటుపడిన భరత్, క్రమంగా ఆ వ్యసనానికి బానిసయ్యాడు. బెట్టింగ్‌ (Online Betting)లో డబ్బులు కోల్పోవడంతో పాటు వాటిని తీర్చేందుకు తీవ్రంగా అప్పులు చేశాడు. ఎంత ప్రయత్నించినా ఆ వ్యసనం నుంచి బయటపడలేకపోవడం, మరోవైపు పెరిగిపోయిన అప్పుల భారం, కుటుంబానికి ఎదురు చెప్పలేని నిస్సహాయతతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. ఘటనా స్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్ చూసి బంధువులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

భార్యను ఉద్దేశించి రాసిన ఆ లేఖలో తన ఆవేదననంతా వెళ్లగక్కాడు. ‘నన్ను క్షమించు.. ఎంత ప్రయత్నించినా ఈ బెట్టింగ్ వ్యసనం నుండి బయటపడలేకపోతున్నాను. నీకు, మన పాపకు ముఖం చూపించలేక ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నాను. పాపను జాగ్రత్తగా చూసుకో…’ అంటూ రాసిన మాటలు ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించాయి. చిరునవ్వులతో సాగిపోవాల్సిన వారి సంసారం, బెట్టింగ్ మహమ్మారి వల్ల క్షణాల్లో చీకటిమయమైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>