కలం, ఆదిలాబాద్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Collector Rajarshi Shah) అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Voter List Revision) పురోగతి, ఫారం- 6,7,8 దరఖాస్తుల పెండింగ్, ఇతర ఎన్నికల సంబంధిత అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఫారం-6, 7,8 దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌లో తప్పుగా మ్యాపింగ్ అయిన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హతలను నిర్ధారించాలన్నారు.
అనర్హులుగా గుర్తించిన ఓటర్ల విషయంలో అనర్హతకు గల కారణాలను స్పష్టంగా నమోదు చేసి, సంబంధిత ఆధారాలతో సహా పూర్తి వివరాలను రికార్డుల్లో భద్రపరచాలన్నారు. నవంబర్ 5వ తేదీ లోపు అన్ని ఇనుమరేషన్ ఫారాలు పూర్తి చేయాలని, ప్రతి బిఎల్ఓ దగ్గర ఎనిమిరేషన్ ఫామ్ ఓటరు లకు ఇచ్చిన రసీదు, ఫారం -7 కి సంబంధించిన రసీదు లు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రూ, డిఆర్ఓ స్రవంతి, ఆర్డిఓ జగదీశ్వర్ రావు ఎన్నికల విభాగం పర్యవేక్షణ నలంద ప్రియ, ఎన్నికల నాయబ్ తహసిల్దార్ మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు.

