ఇంటర్ అర్హత ఉంటే చాలు.. నిర్మల్‌లో డిప్లొమా కోర్సులకు ఛాన్స్!

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల (Nirmal Medical College) లో 2026–27 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో (Diploma Courses) ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శారద శుక్రవారం తెలిపారు. తెలంగాణ పారామెడికల్ బోర్డు, హైదరాబాద్ ఆధ్వర్యంలో నూతనంగా మంజూరైన డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ కోర్సులో 30 సీట్లు, డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్సులో 30 సీట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని, సైన్స్ గ్రూపు అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. దరఖాస్తు ఫారాలు, ఇతర వివరాల కోసం www.tgpmb.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. ఈ నెల 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, పూర్తిచేసిన దరఖాస్తులను నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో అందజేయాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>