Mobile Popup Ad
Mobile Popup Ad

అస్థిపంజరంతో బ్యాంకులోకి.. ఒడిశాలో ఏం జరిగిందంటే!

కలం, వెబ్ డెస్క్: ఒడిశాలో (Odisha) ఓ వ్యక్తి చనిపోయిన తన సోదరి అస్థిపంజరం బ్యాంకులోకి వెళ్లి హల్చల్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఘటనతో బ్యాంక్ అధికారుల తీరుపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో స్పందించారు. మద్యం మత్తులో వచ్చి.. డబ్బుల కోసం గొడవ చేశాడని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం తాము కనీసం డెత్ సర్టిఫికేట్ అయినా ఇవ్వాలని కోరామని.. అంతే తప్ప, ఇతర ఆధారాలేవీ అడగలేదని స్పష్టం చేశారు.

అసలు జరిగింది ఇదీ..

జీతూ మోండా అనే వ్యక్తి చనిపోయిన తన సోదరి బ్యాంకు అకౌంట్లో నుంచి రూ.20 వేలు డ్రా చేద్దామని బ్యాంకుకి వెళ్లాడు. అయితే, ఖాతా ఉన్న వ్యక్తి వస్తేనే ఇస్తామని బ్యాంక్ అధికారులు చెప్పడంతో.. తన సోదరి చనిపోయిందని వివరించాడు. అవేం పట్టించుకోకపోవడంతో ఆగ్రహంతో జీతు మోండా.. శ్మశానంలో నుంచి అస్థిపంజరాన్ని తీసి ఏకంగా 3 కిలోమీటర్లు నడిచి మరీ బ్యాంకుకి వచ్చాడు. దీంతో, అధికారులు హడలిపోయి పోలీసులకు సమాచారం అందించారు. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేసి.. జీతు మోండాను సముదాయించారు. అనంతరం, ఆమె అస్థిపంజరాన్ని ఎక్కడి నుంచి తీశారో తిరిగి అక్కడే ఖననం చేయించేలా చర్యలు తీసుకున్నారు.

Read Also: అమ్రాబాద్ అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>