కలం, నిర్మల్: టీజీఎన్పీడీసీల్ నిర్మల్ (Nirmal) జిల్లా నూతన సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్‌ఈ)గా ఏ. రమేశ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. భూపాలపల్లి జిల్లా నుంచి నిర్మల్‌కు ఆయన బదిలీపై వచ్చారు. ఇదివరకు ఎస్ఈగా పనిచేసిన సుభాశ్ ఆదిలాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్లారు. నూతన ఎస్‌ఈ రమేశ్‌కి జిల్లా విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో విద్యుత్ సరఫరా కోసం మెరుగైన సేవలందించేందుకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

