సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య పెంపు బిల్లుకు రాజ్యసభ ఆమోదం

కలం, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టు(Supreme Court)లో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య సవరణ బిల్లు – 2026కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. సీజేఐ సహా జడ్జీల సంఖ్యను 34 నుంచి 38కి పెంచేందుకు తీసుకొచ్చిన ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందింది. తాజాగా రాజ్యసభ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ బిల్లు త్వరలోనే చట్టరూపం దాల్చనుంది.

రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26న 8 మంది న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు ప్రారంభమైంది. ఆ తర్వాత న్యాయమూర్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. పెండింగ్ కేసులో భారంతో సతమతమవుతున్న సుప్రీంకోర్టుకు తాజా నిర్ణయం ద్వారా ఊరట లభించనుంది. ఈ తాజా సవరణ వల్ల రాజ్యాంగ ధర్మాసనలు మరింత క్రమబద్ధంగా ఏర్పాటు కావడమే కాకుండా, పెండింగ్ కేసుల పరిష్కార వేగవంతం చేసే వీలుంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>