సూర్యాపేట కోర్టు సంచలన తీర్పు.. హత్య కేసులో మహిళకు జీవితఖైదు

కలం, సూర్యాపేట : ఆస్తి కోసం అత్తను హత్య చేసిన కేసు విషయంలో ఓ మహిళకు జీవిత ఖైదు విధిస్తూ సూర్యాపేట (Suryapet) జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. విషయంలోకి వెళితే.. ఆగస్టు 29, 2020లో జిల్లాలోని ఆత్మకూరు మండలం రామోజీ తండాకు చెందిన గుగులోతు మీరి(75) అనే వృద్ధురాలు నిద్రపోతుంది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ఆమె కోడలు గుగులోతు కీరి(55) వృద్దురాలిని ఇనుప రాడ్డుతో తలపై కొట్టి హత్య చేసింది. హత్యపై వృద్ధురాలి కూతురు బానోతు ముత్యాలి ఫిర్యాదు మేరకు ఆత్మకూరు మండల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసులో గుగులోతు కీర్తిని ప్రధాన నిందితురాలిగా చేర్చిన అధికారి సూర్యాపేట రూరల్ ఇన్స్పెక్టర్ నిందితురాలు అస్తి కోసం, వృద్ధురాలిని పోషించడం ఇష్టంలేక హత్య చేసినట్లు నేర అభియోగం పత్రాలు కోర్టుకు దాఖలు చేశారు. ఈ కేసులో ఆధారాలను, బాధితులను విచారించిన జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి నిందితురాలు నేరానికి పాల్పడినట్లు నిర్ధారించి జీవిత ఖైదీ జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా మరో నెల రోజుల పాటు జైలు శిక్ష ఉంటుందని న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. ఈ కేసు నందు ప్రాసిక్యూషన్ తరపున పిపి లింగయ్య కేసును వాదించారు. అందుకు పీసీ శివరామ్, కోర్టు డ్యూటీ లైజన్ అధికారి శ్రీకాంత్ సహకరించారు.

Read Also: బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ మోసం చేసింది : హరీష్ రావు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>