Mobile Popup Ad
Mobile Popup Ad

నా భర్తకు హాని జరిగితే పోలీసులదే బాధ్యత.. అశోక్ కుమార్ భార్య ఆవేదన

కలం, నల్లగొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, అశోక్ అకాడమీ డైరెక్టర్ పాలకూరి అశోక్ కుమార్‌ని జైల్లో కలవనివ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన భార్య పాలకూరి సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని దహనం (NTR Statue Case) చేశారనే ఆరోపణలతో నల్లగొండ పోలీసులు రెండు రోజుల క్రితం అశోక్ కుమార్ గౌడ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

శుక్రవారం జిల్లా జైలులో ఉన్న తన భర్తను చూడటానికి వెళ్లినట్లు సునీత తెలిపారు. జైలు అధికారులు ములాఖత్‌కు సంబంధించిన విజిటర్ పాస్ ఇచ్చినప్పటికీ, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అక్కడే కూర్చోబెట్టాని ఆవేదన వ్యక్తం చేశారు. భర్తను కలవనివ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె మండిపడ్డారు. తన భర్త కోసం తీసుకువచ్చిన బట్టలను కూడా లోపలికి తీసుకెళ్లి ఇవ్వడానికి నిరాకరించారని ఆరోపించారు.

తన భర్తతోపాటు అరెస్ట్ అయి రిమాండ్‌లో ఉన్న ప్రణీత్ అనే వ్యక్తిని తాను కలిశానని, అప్పుడే అసలు విషయం బయటపడిందని సునీత పేర్కొన్నారు. అశోక్ కుమార్ (Ashok Kumar) గౌడ్ రిమాండ్ అయినప్పటి నుంచి జైలులో ఆహారం తీసుకోకుండా నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రణీత్ ద్వారా తెలిసిందని చెప్పారు. జైల్లో తన భర్త ప్రాణానికి హాని జరిగితే, దానికి పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని సునీత హెచ్చరించారు.

Read Also: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్.. ఈ తప్పు చేస్తే ప్రతి 3 నెలలకు రూ.100 ఫైన్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>