Mobile Popup Ad
Mobile Popup Ad

బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి: చిరుమర్తి

కలం, నకిరేకల్: నల్లగొండ జిల్లా నకిరేకల్ (Nakrekal) మండల కేంద్రంలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం ఉత్సాహభరితంగా సాగింది. స్థానిక సువర్ణ గార్డెన్స్ ఫంక్షన్ హాల్‌లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ బూత్‌ల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డిజిటల్ సభ్యత్వ నమోదు’ కార్యక్రమంతోపాటు, ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై బూత్ స్థాయి పార్టీ శ్రేణులకు సమగ్ర అవగాహన కల్పించారు. గ్రామీణ, పట్టణ స్థాయిల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) పిలుపునిచ్చారు.

ఈ సమావేశానికి బీఆర్ఎస్ (BRS) పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్ కార్యాచరణను వివరించారు. నిర్దేశిత సభ్యత్వ నమోదు లక్ష్యాలను ఎలా చేరుకోవాలి, బూత్ స్థాయిలో పార్టీ పట్టును ఎలా పెంచుకోవాలనే అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, దూదిమెట్ల బాలరాజుయాదవ్, బడుగుల లింగయ్యయాదవ్, నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు పాల్గొన్నారు.

Read Also:  అందుకే విద్యా శాఖను నా దగ్గరే పెట్టుకున్నా: సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>