రియల్ టైమ్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

కలం, వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ (RTGS)పై ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) సమీక్ష నిర్వహించారు. దేవాదాయశాఖ, ఆర్‌అండ్‌బీ, ఏపీఎస్ఆర్టీసీ, రవాణా, అగ్నిమాపక శాఖలు అందిస్తున్న సేవలతోపాటుగా రాష్ట్రంలో యూరియా లభ్యతపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఏపీఎస్ఆర్టీసీ, దేవాదాయ, రహదారులు భవనాలు (ఆర్ అండ్ బీ), రవాణా, అగ్నిమాపక, వ్యవసాయ శాఖలు అందిస్తున్న వివిధ సేవలపై ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు. ప్రోయాక్టివ్ గవర్నెన్సు అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్నతాధికారులు సరైన నాయకత్వం అందిస్తేనే క్షేత్రస్థాయిలో పాలనా ఫలితాలు అందుతాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో మెరుగైన ఫలితాలు అందేలా నిర్ణయాలు ఉండాలన్నారు. దేవాదాయశాఖలో ప్రసాదాల నాణ్యతతో పాటు ఆధ్యాత్మికతను మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని సీఎం (CM Chandrababu) సూచించారు.

Read Also: బిగ్ అలర్ట్.. ఏపీలో ‘SIR’ గడువు పెంపు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>