కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ ప్రతిభవంతమైన హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్(NTR) ఒకరు. ఈ హీరో నటించబోయే ప్రతి సినిమాపై భారీ అంచనాలుంటాయి. కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన దేవర మూవీకి మిక్స్‌డ్ టాక్ వినిపించినప్పటికీ, జూనియర్ నటన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్(Prashanth Neel) మూవీలో ఎన్టీఆర్ నటించబోతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్, సలార్ మూవీలు ఆకట్టుకోవడంతో ఈ కాంబోపై భారీ అంచనాలున్నాయి. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు? అనేది ఆసక్తిగా మారింది. గుబురు గడ్డం, గంభీరమైన లుక్‌తో కనిపించిన ఫొటో ఒకటి ఈ మధ్య వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ(Dragon)కి సంబంధించిన ఇంట్రస్టింగ్ ఆప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
డ్రాగన్(Dragon) అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షెడ్యూల్ డిసెంబర్ మొదటి వారంలో రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంది. హై యాక్షన్ సన్నివేశాలు భారీగా ఉంటాయి. ఎన్టీఆర్ గత సినిమాల కంటే యాక్షన్ సీన్స్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఎలాంటి డూప్స్‌కు అవకాశం ఇవ్వకుండా ఎన్టీఆర్ స్వయంగా యాక్షన్ సీన్స్‌లో నటించబోతున్నారు. వింటర్ సీజన్‌లోనూ హై ఓల్టేజ్ షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొనబోతుండటం ఈ మూవీపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.
Read Also: గుమ్మడి నర్సయ్య మూవీ లాంచింగ్ ఈవెంట్‌లో రాజ్ కుమార్ ఎమోషనల్
Follow Us On: X(Twitter)


