Mobile Popup Ad
Mobile Popup Ad

సంగారెడ్డి లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

కలం, మెదక్ బ్యూరో: స్వర్గీయ ఎన్టీఆర్ 103 జయంతి సందర్బంగా సంగారెడ్డి (Sangareddy)లో మెదక్ పార్లమెంట్ టీడీపీ కన్వీనర్ ఇల్లేందుల రమేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, అనంతరం జిల్లా పరిషత్ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి సంగారెడ్డి x రోడ్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా మెదక్ పార్లమెంట్ టీడీపీ కన్వీనర్ ఇల్లేందుల రమేష్ మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ కారణ జన్ముడని, తెలుగుదేశం పార్టీ స్థాపించి న 9 నెలల కాలములోనే అధికారంలోకి వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా అయి పాలనలో ఎన్నో సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత ఎన్టీఆర్ దే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

Read Also: వామ్మో ఎకరం రూ.237 కోట్లు.. రాయదుర్గంలో రికార్డు ధర

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>