Mobile Popup Ad
Mobile Popup Ad

ధాన్యం అన్‌లోడ్ ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆదర్శ్ సురభి

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: వనపర్తి (Wanaparthy) జిల్లాలోని రైస్ మిల్లర్లు వరి ధాన్యాన్ని దించుకోవడంలో ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించి, సమన్వయంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi)  సూచించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో అదనపు కలెక్టర్ వినోద్ కుమార్‌తో కలిసి రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వరి ధాన్యం నిల్వ కోసం అదనపు స్థలాల ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఈసారి రికార్డు స్థాయిలో వరి దిగుబడులు రావడంతో ధాన్యం నిల్వకు అదనపు స్థలం అవసరం ఏర్పడిందని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ సమస్యలు తలెత్తకుండా రైస్ మిల్లర్లు ధాన్యం అన్‌లోడ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

మిల్లర్ల వారీగా గోదాములలో ఉన్న ఖాళీ స్థలాల వివరాలను సమీక్షించిన కలెక్టర్ (Collector Adarsh Surabhi), అదనంగా ధాన్యం బస్తాల కేటాయింపుపై సూచనలు చేశారు. ధాన్యాన్ని వేగంగా దింపుకుని నిల్వ చేయాలని ఆదేశించారు. ధాన్యం నిల్వ కోసం అవసరమైన అద్దెను ప్రభుత్వం చెల్లిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీసీఎస్ఓ కాశీ విశ్వనాథ్, జిల్లా మేనేజర్ సివిల్ సప్లై ఆంజనేయులు, రైస్ మిల్లర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read Also: సిద్దిపేట ఓట్ల పై నివేదిక ఇవ్వండి… ఎన్నికల సంఘం ఆదేశం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>