కలం, వెబ్ డెస్క్: నీట్ పేపర్ లీకేజీపై కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్‌యూఐ (NSUI) నాయకులు, కార్యకర్తలు కదం తొక్కారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ భారీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యపు వైఖరి కారణంగా లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సహా ఎన్టీఏ అధికారులు రాజీనామా చేయాలని నినదించారు. వారికి పదవుల్లో కొనసాగే అర్హత లేదన్నారు. ప్రధాని మోదీ ఇప్పటివరకు ఈ ఘటనపై ఒక్క మాట మాట్లాడకపోవడం సిగ్గు చేటని మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో హూరెత్తించారు.

