‘గ్యాస్ టాక్స్’ వేస్తే కఠిన చర్యలు.. హోటళ్ళకు వార్నింగ్

కలం, తెలంగాణ బ్యూరో : హోటళ్ళు, రెస్టారెంట్లు గ్యాస్ టాక్స్ లేదా ఫ్యూయల్ టాక్స్ లేదా సర్‌చార్జి ( LPG Surcharge) పేరుతో చేసే అదనపు వసూళ్లపై కేంద్ర సర్కార్ (Centre Govt) సీరియస్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉన్న పన్నులను మాత్రమే విధించాలని, కొత్త పన్నులేవీ కుదరదని తేల్చి చెప్పింది. కొన్న హోటళ్లు, రెస్టారెంట్లు వివిధ రూపాల్లో నిబంధనలకు విరుద్ధమైన పన్నులు వసూలు చేయడాన్ని తప్పుపట్టింది. ఇలాంటి పన్నులకు చట్టబద్ధత లేనందున కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలను కేంధ్ర వినియోగదారుల ప్రొటెక్షన్ అథారిటీ విడుదల చేసింది. ప్యూయల్ కాస్ట్ రికవరీ, ఎల్పీజీ సర్‌చార్జి పేరుతో హోటళ్లు, రెస్టారెంట్లు కొన్నిచోట్ల వసూలు చేస్తన్నట్లు ఫిర్యాదులు వచ్చిన అంశాన్ని ఉదహరించింది. తక్షణం అలాంటి పన్నులు, సర్‌చార్జిలను బిల్లుల నుంచి తొలగించాలని ఆదేశించింది.

మెనూలో పేర్కొన్న మేరకే వసూలు చేయాలి :

ఇరాన్‌లో యుద్ధం (Iran War) కారణంగా సప్లై కావాల్సిన ముడిచమురు, ఎల్పీజీ, సీఎన్జీ తదితరాలకు ఇబ్బందులు ఏర్పడడంతో వాటితో ప్రత్యక్ష సంబంధం ఉన్న వ్యాపార సంస్థలు అదనపు చార్జీలను గత కొన్ని రోజులుగా కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు ఎల్పీజీ టాక్స్ (LPG Surcharge), గ్యాస్ టాక్స్, సర్‌చార్జి పేరుతో బిల్లులో దాదాపు 15% మేర అదనంగా కలెక్ట్ చేస్తన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి పన్నుల విధింపుపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వకున్నా, కొత్త నిబంధనలను పెట్టకపోయినా హోటళ్ల యాజమాన్యాలు వసూలు చేయడాన్ని కస్టమర్లు తప్పుపట్టారు. అథారిటీకి ఫిర్యాదులూ వెళ్ళాయి. గ్యాస్ ధరలు పెరిగాయని, రవాణా ఖర్చులు అదనంగా భరించాల్సి వస్తున్నదని.. ఇలాంటి పేర్లతో కస్టమర్ల నుంచి వసూలు చేయడం అక్రమ వ్యాపార పద్ధతి (Unfair Trade Practices) కిందకే వస్తుందని అథారిటీ ఆ ఆదేశాల్లో పేర్కొన్నది. కేవలం మెనూలో పేర్కొన్న ధరలపై వర్తించే పన్నులను మాత్రమే కస్టమర్ల నుంచి తీసుకోవాలని స్పష్టం చేసింది. హోటల్ నిర్వహణ ఖర్చులుగానీ, విద్యుత్, వంటగ్యాస్ తదితరాలన్నీ మెనూలో పేర్కొనే ధరల్లోనే కలిసి ఉంటాయని, అదనంగా వసూలు చేయడం వీలు పడదని క్లారిటీ ఇచ్చింది.

Read Also: నోట్ల రద్దు, కరోనా తర్వాత.. మరోసారి మోదీ కీలక స్టెప్..!

Follow Us On: Youtube

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>