కలం, వెబ్ డెస్క్: కాంగో (Congo) దేశంలో కొనసాగుతున్న హింసాకాండపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల (UN Human Rights) విభాగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ జరుగుతున్న దారుణాలను వివరిస్తూ ఐరాస మానవ హక్కుల మండలి 61వ సమావేశంలో డిప్యూటీ చీఫ్ నాదా అల్ నాషీఫ్ కీలక నివేదికను సమర్పించారు. గత ఐదు నెలల కాలంలోనే సుమారు 600 సామూహిక హత్యలు జరిగినట్లు ఐరాస ధృవీకరించింది. ఈ దాడుల్లో 1,300 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధంలో అత్యాచారాలను, లైంగిక హింసను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని, ఇది అత్యంత విచారకరమని నాదా అల్ నాషీఫ్ పేర్కొన్నారు.
కాంగోలో (Congo) తక్షణమే విద్వేషాలు విడిచిపెట్టాలని ఐరాస అన్ని వర్గాలను కోరింది. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ, సామాన్య ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది. కాంగోలో సాయుధ ముఠాల మధ్య జరుగుతున్న పోరాటంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. మానవ హక్కుల ఉల్లంఘనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి ఈ తరుణంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Also: మహిళా అభ్యర్థుల ఎంపిక పార్టీలకు ఛాలెంజ్
Follow Us On: Instagram

