Mobile Popup Ad
Mobile Popup Ad

నటోరియస్ డ్రగ్స్ క్రిమినల్ అరెస్ట్

కలం, వెబ్ డెస్క్: నటోరియస్ డ్రగ్స్ క్రిమినల్ షేక్ ఫైసల్‌ (Sheikh Faisal) పోలీసులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్ లోని అంబర్‌పేట ప్రాంతంలో డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున అంబర్‌పేట్ ప్రాంతంలో డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు సమాచారం రావడంతో ఎక్సైజ్ ఎస్టీఎఫ్  ఎస్సై సంధ్యా అండ్ టీమ్ తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న నలుగురిని తనిఖీ చేసి వారి వద్ద 4.62 గ్రాముల ఎండీఎంఎ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌తో పాటు కారును, మూడు సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. పట్టుబడ్డ వారిలో కీలక నిందితుడు షేక్ ఫైసల్‌‌తోపాటు పీ అన్షు ప్రసాద్, ఎండీ మసూద్, ఏ ప్రీతి వర్ధన్‌ ఉన్నారు.

బెంగళూరు టు హైదరాబాద్

బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి విక్రయాలు చేస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారని  అధికారులు తెలిపారు. ప్రధాన నిందితుడు షేక్ ఫైసల్ (Sheikh Faisal) గతంలోనూ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. డ్రగ్స్ అలవాటు కారణంగా ప్రమాదంలో కుడి చేయి కోల్పోయినప్పటికీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని తెలిసింది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్, వాహనం, సెల్‌ఫోన్లను కాచిగూడ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు.

Read Also: అవసరాలకు సరిపోయే ఫ్రిడ్జ్‌ను ఎలా ఎంచుకోవాలో తెలుసా?

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>