Mobile Popup Ad
Mobile Popup Ad

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు : ఇలా త్రిపాఠి

కలం, నిజామాబాద్ బ్యూరో : ఈ నెల 13 నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Nizamabad Collector Ila Tripathi) అధికారులను ఆదేశించారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 17,789 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 11,425 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 6364 మంది హాజరుకానున్నారని వివరించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 39 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయని, ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఫస్టియర్ పరీక్షలు, తిరిగి సాయంత్రం 2.30 గంటల నుండి 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు కొనసాగుతాయని అన్నారు. వార్షిక పరీక్షల తరహాలోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా సజావుగా, పకడ్బందీగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రైవేటు సెంటర్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఎక్కడ కూడా కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. పోలీస్, ఆర్టీసీ, రెవెన్యూ, పోస్టల్, మెడికల్ అండ్ హెల్త్ తదితర లైన్ డిపార్ట్మెంట్ లకు చెందిన అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు.

ప్రశ్నాపత్రాలను ఆయా రూట్ ల వారీగా పోలీసు బందోబస్తు మధ్య తీసుకెళ్లాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తూ, తగిన పోలీసు బందోబస్తు ఉండేలా చూడాలని చెప్పారు. పరీక్షలు జరిగే సమయంలో పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్ లను మూసి ఉంచాలని ఆదేశించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రతి పరీక్షా కేంద్రంలోనూ తప్పనిసరిగా రక్షిత మంచినీటి వసతి అందుబాటులో ఉంచాలని, పరిశుభ్రమైన వాతావరణం నెలకొనెలా చర్యలు తీసుకోవాలని, తగినంత గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచించారు.

ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లతో ఆశా వర్కర్లు, ఏఎన్ఎం లను ఎగ్జామ్ సెంటర్లలో అందుబాటులో ఉంచాలని, మూడు పరీకా కేంద్రాలకు కలుపుకుని ఒకటి చొప్పున 108 అంబులెన్స్ లను కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. పరీక్షలు కొనసాగే సమయాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ట్రాన్స్ కో అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా సమయాలకు అనుగుణంగా బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ త్రిపాఠి (Ila Tripathi) ఆర్టీసీ అధికారులకు సూచించారు.

Read Also: నటోరియస్ డ్రగ్స్ క్రిమినల్ అరెస్ట్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>