కలం, కరీంనగర్ బ్యూరో: అర్బన్ నక్సల్స్ పై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అర్బన్ నక్సల్స్ లేరని తేల్చి చెప్పారు. ఈ విషయం అసలు తన దృష్టికి రాలేదన్నారు. ఆదివారం ఆయన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఐబీ కాలనీలో రూ. 12 కోట్లతో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన పోలీసుల గృహ సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆపరేషన్ కగార్‌తో రాష్ట్రంలో ఐదుగురు మావోయిస్టులు మినహా మిగిలిన వారంతా లొంగిపోయారన్నారు. మావోయిస్టు సానుభూతిపరులు ఉంటే ఉండవచ్చని అన్నారు.
ఆ ఐదుగురు కూడా తెలంగాణకు చెందినవారైనా తెలంగాణలో లేరని, ఇతర రాష్ట్రాల్లో ఉన్నారని తెలిపారు. గణపతి (Maoist Ganapathi) ఎప్పుడు లొంగిపోతాడో తనకు తెలియదన్నారు. తెలంగాణ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ఆవిర్భవించింది. రాష్ట్రంలో అర్బన్ నక్సలైట్లు (Urban Naxals) ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తెలంగాణలో అర్బన్ నక్సలైట్లు లేరని. ఎవ్వరూ అనుమానించాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు గతంలో రవాణా వ్యవస్థ మాత్రమే చేసేదని, ఇప్పుడు వీఆర్వో నుండి ముఖ్యమంత్రి వరకు అందరూ 99 రోజుల ప్రజాపాలన అవగాహన కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారని ఆయన (DGP Shivadhar Reddy) అన్నారు. ఈ కార్యక్రమంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝ పాల్గొన్నారు.
Read Also: నో కాంప్రమైజ్.. ఇదే జెన్ జీ ఫార్ములా!!
Follow Us On: Sharechat

