Mobile Popup Ad
Mobile Popup Ad

అత్తను హతమార్చడానికి అల్లుడి కుట్ర: తలుపులకు కరెంట్ !

కలం, వెబ్​ డెస్క్​ : జగిత్యాల (Jagtial) జిల్లా జగదేవ్ పేట గ్రామంలో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో ఓ అల్లుడు ఏకంగా తన అత్తనే అంతం చేయాలని చూశాడు. ఈ ప్రమాదం నుంచి ఆమె తృటిలో తప్పించుకున్నది.

వివరాల్లోకి వెళ్తే.. జగదేవ్ పేట (Jagadevpeta) గ్రామానికి చెందిన మల్లారెడ్డి భార్య పద్మకు, అతడికి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపం చెందిన పద్మ తన పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మల్లారెడ్డి తన భార్యను కాపురానికి పంపాల్సిందిగా అత్త రాజవ్వను కోరుతున్నాడు. అయితే అత్త ఎంతకీ ఒప్పుకోకపోవడంతో, ఆమె వల్లే తన భార్య రావడం లేదని మల్లారెడ్డి కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను అంతమొందించాలని ప్లాన్ వేశాడు.

మల్లారెడ్డి అర్థరాత్రి సమయంలో తన అత్త ఇంటికి వెళ్లి, ఆమె నివసిస్తున్న ఇంటి తలుపులకు విద్యుత్ వైర్లను అమర్చాడు. తెల్లవారుజామున రాజవ్వ తలుపులు తీయగా ఆమెకు స్వల్పంగా విద్యుత్ షాక్ తగిలింది. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. వెంటనే జరిగిన విషయాన్ని గమనించిన రాజవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడు మల్లారెడ్డిని అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు.

Read Also: నల్లగొండలో భారీ పెట్టుబడి మోసం.. విప్స్ గ్రూప్ ఏజెంట్ల అరెస్ట్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>