సరికొత్తగా ‘ఆధార్’.. కీలక మార్పులు

కలం, వెబ్​ డెస్క్​ : ఆధార్ కార్డు (Aadhaar Card) వినియోగదారుల భద్రత, గోప్యతను మరింత పటిష్టం చేసే దిశగా విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆధార్ కార్డు సరికొత్త రూపంలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుత కార్డులపై ఉండే పేరు, చిరునామా, ఆధార్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను కొత్త కార్డుల నుంచి తొలగించనున్నారు. వీటికి బదులుగా కేవలం కార్డుదారుడి ఫొటో, ఒక క్యూఆర్ కోడ్‌ను మాత్రమే ముద్రిస్తారు.

ఈ మార్పు వల్ల కార్డు (Aadhaar Card) ఇతరుల చేతికి చిక్కినప్పటికీ సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండదని అధికారులు భావిస్తున్నారు. కేవలం వెరిఫైడ్ స్కానర్ల ద్వారా ఆ క్యూఆర్ కోడ్‌ను (QR Code) స్కాన్ చేసినప్పుడు మాత్రమే సంబంధిత వ్యక్తి వివరాలు కనిపిస్తాయి. సమాచార గోప్యతను కాపాడటం, డేటా చోరీని అరికట్టడమే లక్ష్యంగా ఈ సరికొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నారు.

Read Also: వింటర్​ ఒలింపిక్స్​లో కండోమ్స్​ కొరత.. 72 గంటల్లో 10 వేలు ఖాళీ

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>