Mobile Popup Ad
Mobile Popup Ad

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎదురే లేదు : సీఎం రేవంత్

కలం, డెస్క్ : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy). తమ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను చూసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను మెజార్టీ సీట్లలో గెలిపించి ప్రజలు మద్దతు తెలపాలని కోరారు సీఎం రేవంత్. మిర్యాల గూడలో జరిగిన సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. ‘గత బీఆర్ ఎస్ హయాంలో రేషన్ కార్డుల కోసం ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అందరికీ రేషన్ కార్డులు ఇచ్చేశాం. నిరుపేదలకు సన్నబియ్యం ఇస్తున్న చరిత్రమాదే. మహిళలు, యువతకు, నిరుద్యోగులకు, రైతులకు అన్ని రకాలుగా మేలు చేస్తున్న ప్రభుత్వం మనదే. కాబట్టి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భారీగా సీట్లు గెలిపించండి’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

Read Also: ఓటర్లకు బంపరాఫర్​.. గెలిపిస్తే తిరుమల శ్రీవారి దర్శనం!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>